Chhattisgarh: కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. సత్నామీ సమాజ్ నేతలు బీజేపీలో చేరిక

ABN , First Publish Date - 2023-08-22T19:17:20+05:30 IST

కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీకి గట్టి దెబ్బ తలిగింది. సత్నామి సమాజ్ ఆధ్యాత్మిక గురువు బాల్‌దాస్ సాహెబ్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గురు కుష్వంత్ దాస్ సాహెబ్, సత్నామి సమాజ్‌కు చెందిన గురు అసాంభ్ దాస్ సాహెబ్, గురు ద్వారకా దాస్ సాహెబ్, గురు సౌరభ్ దాస్ సాహెబ్‌లు బీజేపీలో చేరారు.

Chhattisgarh: కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. సత్నామీ సమాజ్ నేతలు బీజేపీలో చేరిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఆ పార్టీకి గట్టి దెబ్బ తలిగింది. సత్నామి సమాజ్ (Satnami Samaj) ఆధ్యాత్మిక గురువు బాల్‌దాస్ సాహెబ్ (Baldas saheb) బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గురు కుష్వంత్ దాస్ సాహెబ్, సత్నామి సమాజ్‌కు చెందిన గురు అసాంభ్ దాస్ సాహెబ్, గురు ద్వారకా దాస్ సాహెబ్, గురు సౌరభ్ దాస్ సాహెబ్‌లు బీజేపీలో చేరారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ చీఫ్ అరుణ్ సావో, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, రాయ్‌పూర్ ఎంపీ సునీల్ సోనీ, ఎమ్మెల్యే బ్రిజ్‌మోహన్ అగర్వాల్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.


కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్న బాల్‌దాస్ సాహెబ్

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము సామాజిక నిర్లక్ష్యం, వివక్షకు గురయ్యామని, సమాజ అభ్యున్నతికి ఆ పార్టీ చేసిందేమీ లేదని బాల్‌దాస్ సాహెబ్ ఆరోపించారు. పార్టీలో తమకెంలాంటి గౌరవం ఇవ్వలేదన్నారు. అరంగ్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్నట్టు బాల్‌దాస్ కుమారుడు గురు కుష్వంత్ సాహెబ్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని షెడ్యూల్డ్ కులాల నియోజకవర్గాల్లో బాల్‌సాహెబ్, ఇతర నేతలకు గట్టి పట్టు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌సీ రిజర్వ్‌డ్ సీట్లు 10 ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం సీట్లలో ఎస్‌సీల ప్రభావం 50 శాతం వరకూ ఉంటుంది. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - 2023-08-22T19:17:20+05:30 IST