BJP: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ

ABN , First Publish Date - 2023-06-10T09:27:51+05:30 IST

మాజీ ఎంపీ డాక్టర్‌ మైత్రేయన్‌(Dr. Maitreyan) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత అక్టోబర్‌లో పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన మైత్రేయన్‌ కొంతకాలంగా రాజకీయాలకు

BJP: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే మాజీ ఎంపీ డాక్టర్‌ మైత్రేయన్‌(Dr. Maitreyan) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత అక్టోబర్‌లో పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన మైత్రేయన్‌ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే(AIADMK)లో చేరక మునుపు ఆయన బీజేపీ రాష్ట్ర డిప్యూటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో సీనియర్‌ నేతలతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా బీజేపీ నుంచి వైదొలగి మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. మూడుసార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. జయకు అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరించారు. జయ మృతి తర్వాత పార్టీలో ఏర్పడిన పరిణామాల అనంతరం ఆయన ఓపీఎస్‌(OPS) వర్గంలో చేరారు. కొంతకాలం తరువాత మళ్లీ మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్‌ వర్గంలో చేరి, అటు పిమ్మట ఓపీఎస్‌ వర్గంలో చేరారు. దీనితో ఆయనను ఈపీఎస్‌(EPS) పార్టీనుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆ సందర్భంగా మైత్రేయన్‌ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ రవి శాలువతో సత్కరించారు. అనంతరం మైత్రేయన్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరికతో తాను తన సొంత ఇంటికి వచ్చినట్లుందని పేర్కొన్నారు.

nani5.jpg

Updated Date - 2023-06-10T09:27:51+05:30 IST