Share News

Mizoram elctions: 40 సీట్లకు 40 మంది స్టార్ క్యాంపెయినర్లు

ABN , First Publish Date - 2023-10-20T18:31:46+05:30 IST

ఎన్నికలు చిన్నవైనా పెద్దవైనా తమ పోటీ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పే బీజేపీ ఈసారి మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా సీరియస్‌గానే తీసుకుంది. 40 మంది అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందిని శుక్రవారంనాడు ప్రకటించింది.

Mizoram elctions: 40 సీట్లకు  40 మంది స్టార్ క్యాంపెయినర్లు

న్యూఢిల్లీ: ఎన్నికలు చిన్నవైనా పెద్దవైనా తమ పోటీ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పే బీజేపీ (BJP) ఈసారి మిజోరం అసెంబ్లీ ఎన్నికలను (Mizoram elctions) కూడా సీరియస్‌గానే తీసుకుంది. 40 మంది అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లగా (Star campaigners) 40 మందిని శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, నితన్ గడ్కరి, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, పార్టీ జాతీయ ప్రతినిధి అనిల్ కె.ఆంటోనీ తదితర ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.


మిజోరం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ఇంతకుముందు బీజేపీ ప్రకటించింది. వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 12 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. నవంబర్ 7న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. ప్రసుత సీఎం జోరంతాంగ సారథ్యంలోని రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీతో ముగియనుంది.


కాగా, ఎన్నికల బరిలో పోటీపడుతున్న పార్టీలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరం పీపిల్స్ మూమెంట్ (జేపీఎం), కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో జోరంతాంగ సారథ్యంలోని ఎంఎన్ఎఫ్ 18 సీట్లు గెలుచుకోగా, జేపీఎం 8 సీట్లు, కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ)కు సారథ్యం వహిస్తున్న బీజేపీ ఇంతవరకూ స్వతంత్రంగా మిజోరంలో ఉనికిని చాటుకోలేకపోయింది.

Updated Date - 2023-10-20T18:31:46+05:30 IST