Karnataka VS Up: బీజేపీకి కర్ణాటకలో ఖేదం... యూపీలో కాస్త హ్యాపీ.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-05-13T15:05:31+05:30 IST
న్యూఢిల్లీ: జయాపజాయాలనేవి రాజకీయాల్లో సహజమే అయినా, గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుంది, ఓటమి నిరాశ కలిగించినా, పాఠాలు నేర్పుతుంది. గెలుపే లక్ష్యంగా కేంద్ర నాయకత్వమంతా కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన కర్ణాటకలో (Karnataka) బీజేపీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాలు ఖేదం మిగిల్చాయి. ఇదే సమయంలో యూపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మేయర్ సీట్లన్నీ బీజేపీ గంపగుత్తగా ఎగరేసుకుపోయేలా ఫలితాలు వెలువడుతున్నారు.
న్యూఢిల్లీ: జయాపజాయాలనేవి రాజకీయాల్లో సహజమే అయినా, గెలుపు మరింత ఉత్సాహాన్నిస్తుంది, ఓటమి నిరాశ కలిగించినా, పాఠాలు నేర్పుతుంది. గెలుపే లక్ష్యంగా కేంద్ర నాయకత్వమంతా కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన కర్ణాటకలో (Karnataka) బీజేపీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాలు ఖేదం మిగిల్చాయి. ఇదే సమయంలో యూపీలో (Uttar Pradesh) జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (Civic body polls) కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మేయర్ సీట్లన్నీ బీజేపీ గంపగుత్తగా ఎగరేసుకుపోయేలా ఫలితాలు వెలువడుతున్నారు.
కర్ణాటకలో...
కర్ణాటక 'హస్త' గతమైంది. కర్ణాటకలో కౌంటింగ్ ప్రారంభించినప్పటి నుంచి మొదటి రెండు గంటలూ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొనగా, క్రమంగా కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దిశగా దుసుకుపోయింది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటగానే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. శాసనసభా పక్ష సమావేశం ఆదివారంనాడు ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
యూపీలో...
మరోవైపు, శనివారంనాడే వెలువడుతున్న యూపీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం ఖరారైంది. మేయర్ సీట్లన్నీ దాదాపు కైవసం చేసుకునే దిశగా మొదట్నిచీ బీజేపీ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. మొత్తం 17 మేయర్ స్థానాల్లో 16 స్థానాల్లో బీజేపీ లీడింగ్ కొనసాగిస్తుండగా, బహుజన్ సమాజ్ పార్టీ ఒక సీటులో ఆధిక్యంలో సాగుతోంది. అనూహ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మేయర్ స్థానాల్లో ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది. లక్నో, కాన్పూర్, గొరఖ్‌పూర్, ప్రయాగరాజ్, ఘజియాబాద్, అయోధ్య, అలీగఢ్ వంటి కీలక మేయర్ స్థానాలు బీజేపీ ఎగరేసుకుపోవడం ఖాయమైంది. షహరాన్‌పూర్ మున్సిపల్ స్థానంలో ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీఎస్‌పీ ముందంజలో ఉంది. కానీ, తుది ఫలితాలు వెలువడే సమయానికి ఫలితాల్లో మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. అయితే బీజేపీ విజయఢంకా మోగించడం ఖాయమైందంటూ బీజేపీ శ్రేణులు యూపీలో సంబరాలు జరుపుకొంటున్నాయి.