Maharashtra: మోదీ సర్కారు ఆమోదంతో మహారాష్ట్రలో సంబరాలు

ABN , First Publish Date - 2023-02-24T22:48:43+05:30 IST

మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహారాష్ట్రలో సంబరాలు జరుగుతున్నాయి.

Maharashtra: మోదీ సర్కారు ఆమోదంతో మహారాష్ట్రలో సంబరాలు
Central Government approves the renaming of Aurangabad as Chhatrapati Sambhajinagar

ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహారాష్ట్రలో సంబరాలు జరుగుతున్నాయి. ఔరంగాబాద్‌కు ఛత్రపతి శంభాజీనగర్ అని, ఉస్మానాబాద్‌కు ధారాశివ్ అని పేర్లు మారుస్తూ మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన సర్కారు కేంద్రానికి ప్రతిపాదన పంపింది. దీనికి ఎట్టకేలకూ కేంద్రం ఆమోదం తెలిపింది. వాస్తవానికి పేర్లు మారుస్తామని బీజేపీ-శివసేన చాలాకాలంగా చెబుతూ వస్తున్నాయి. ఎట్టకేలకూ పేర్లు మారడంతో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పార్టీల నాయకులు పండగ చేసుకుంటున్నారు. బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Updated Date - 2023-02-24T22:49:33+05:30 IST