Chandrababu: శివాలయాన్ని సందర్శించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2023-09-06T11:05:57+05:30 IST

బళ్లారి జిల్లా బాలాజీ నగర్‌ క్యాంపులో కృష్ణ శిలతో నిర్మిస్తున్న శివాలయాన్ని మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)

Chandrababu: శివాలయాన్ని సందర్శించిన చంద్రబాబు

- సత్కరించిన కొర్రపాటి సాయి

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): బళ్లారి జిల్లా బాలాజీ నగర్‌ క్యాంపులో కృష్ణ శిలతో నిర్మిస్తున్న శివాలయాన్ని మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సందర్శించారు. చంద్రబాబుకు సినీ నిర్మాత కొర్రపాటి సాయి(Film producer Korrapati Sai) రోడ్డు నుంచి ఆలయం వరకూ పూలబాట వేసి స్వాగతించారు. అనంతరం మైసూరు తలపాగాతో సత్కరించారు. చంద్రబాబు ఆలయమంతా తిరిగి నిర్మాణానికి సంబందించిన వివరాలు తెలుసుకున్నారు. దేవాలయం చాలా అద్భుతంగా కడుతున్నారని చంద్రబాబు కొనియాడారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, బాలాజీ నగర్‌ క్యాంపు వాసులు, కొర్రపాటి రామక్రిష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-09-06T11:05:57+05:30 IST