Share News

Chattisgarh Elections: సోనియా సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు

ABN , First Publish Date - 2023-10-20T18:55:17+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ లో రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉధృత ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

Chattisgarh Elections: సోనియా సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌ (Chattisgarh)లో రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ (Congress) పార్టీ ఉధృత ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి కుమారి సెల్జా, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పార్టీ నేతలు టీఎస్ సింగ్ దేవ్, అల్కా లంబా, అజయ్ మాకెన్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఈ బాజితాలో చోటుచేసుకున్నాయి.


ఛత్తీస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరుగనుంది. తొలి విడతగా నవంబర్ 7న 20 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తక్కిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కాలపరిమితి 2024 జనవరి 3వ తేదీతో ముగియనుంది.


కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో 68 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీజేపీ 15 సీట్లకే పరిమితమైంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె) 5 సీట్లు గెలుచుకోగా, బీఎస్‌పీ రెండు సీట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో 75 సీట్లలో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుంది. ఓబీసీ, రూరల్ ఓటర్లలో సీఎం బూపేష్ బఘేష్‌కు ఉన్న ప్రజాదరణ, రైతులు, గిరిజనులు, పేదల సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో తమ గెలుపు నల్లేరుమీద నడకేనని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

Updated Date - 2023-10-20T18:55:17+05:30 IST