Chief Minister: ఆ 16 మందిని విడిపించండి సార్..

ABN , First Publish Date - 2023-03-08T10:29:01+05:30 IST

బ్రిటిష్‌ సైనికుల చెర నుంచి తమిళనాడు(Tamil Nadu)తో పాటు కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన 16 మంది జాలర్లను విడిపిం

Chief Minister: ఆ 16 మందిని విడిపించండి సార్..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): బ్రిటిష్‌ సైనికుల చెర నుంచి తమిళనాడు(Tamil Nadu)తో పాటు కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన 16 మంది జాలర్లను విడిపించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. గత నెల 9న తేంగాపట్టణం నుంచి రాష్ట్రానికి చెందిన ఆరుగురు, కేరళ(Kerala)కు చెందిన ఏడుగురు, పశ్చిమబెంగాల్‌(West Bengal)కు చెందిన ముగ్గురు జాలర్లు హిందూ మహాసముద్రంలోని భారత-బ్రిటీష్‌ సరిహద్దు జలాల్లో చేపల వేటకు వెళ్లారని గుర్తు చేశారు. అయితే వారు గత నెల 23న చేపలు పడుతుండగా, బ్రిటిష్‌ సైన్యం వారిని అదుపులోకి తీసుకునిందన్నారు. దీంతో చేపల వేటే ప్రధానంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అందువల్ల తక్షణం వారిని విడిపించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాంగ శాఖ దౌత్యమార్గాల ద్వారా సంబంధిత అధికారులతో చర్చించి, వారిని విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2023-03-08T10:29:01+05:30 IST