CM's warning: అమిత్‌షాకు స్టాలిన్‌ హెచ్చరిక.. మీ మాటలకు తలూపే బొమ్మలం కాము..

ABN , First Publish Date - 2023-08-06T10:33:39+05:30 IST

ఎలాంటి ప్రతిఘటన లేకుండా ప్రతి ఒక్కరూ హిందీ భాషను నేర్చుకునేందుకు సమ్మతి తెలపాలంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షా

CM's warning: అమిత్‌షాకు స్టాలిన్‌ హెచ్చరిక.. మీ మాటలకు తలూపే బొమ్మలం కాము..

- హిందీని రుద్దితే మళ్లీ భాషోద్యమం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఎలాంటి ప్రతిఘటన లేకుండా ప్రతి ఒక్కరూ హిందీ భాషను నేర్చుకునేందుకు సమ్మతి తెలపాలంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శనివారం తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలు ప్రజలను హిందీ భాషకు బానిసలుగా మార్చే నిరంకుశ ప్రయత్నంలా వున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్టాలిన్‌ ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేశారు. అమిత్‌షా మాటలను ఆమోదించడానికి తమిళనాడు తలూపే బొమ్మ కాదని వ్యాఖ్యానించారు. తమిళనాట పర్యటించేటప్పుడు అత్యంత ప్రాచీనమైన భాష తమిళమేనంటూ నాలుకపై తేనె పూయడం, ఢిల్లీ వెళ్ళగానే ఆ నాలుకపై విషాన్ని కుమ్మరించడం అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. ఇది బీజేపీ నాయకుల కుటిల రాజకీయాలకు నిదర్శనమన్నారు. పశ్చిమబెంగాల్‌, కర్నాటక వంటి పలు రాష్ట్రాలు కూడా ఇప్పుడు నిర్బంధ హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని అమిత్‌షా గ్రహించాలన్నారు. రాష్ట్రంలో 1965 నాటి భాషోద్యమ పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు కల్పించవద్దని, హిందీని రుద్దితే మళ్లీ భాషోద్యమం తప్పదని స్టాలిన్‌ అమిత్‌షాను హెచ్చరించారు.

Updated Date - 2023-08-06T10:33:39+05:30 IST