Haryana and Delhi : హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో గస్తీ ముమ్మరం..
ABN , First Publish Date - 2023-08-02T10:03:21+05:30 IST
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన మత ఘర్షణలు గురుగ్రామ్‌కు విస్తరించాయి. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీకి అతి సమీపంలోనే గురుగ్రామ్ ఉండటంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన మత ఘర్షణలు గురుగ్రామ్‌కు విస్తరించాయి. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీకి అతి సమీపంలోనే గురుగ్రామ్ ఉండటంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, వదంతులను నమ్మవద్దని, ఏదైనా సహాయం కావాలంటే 112 నెంబరుకు ఫోన్ చేయాలని గురుగ్రామ్ పోలీసులు కోరారు. గృహదహనాలు, స్వల్ప స్థాయి ఘర్షణలు మాత్రమే జరిగాయని తెలిపారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. జిల్లాలోని దేవాలయాలన్నిటినీ సందర్శిస్తూ జరిగే జలాభిషేక యాత్రపై దుండగులు దాడి చేయడంతో గృహదహనాలు, రాళ్లు రువ్వడం వంటి దారుణాలు జరిగాయి. గో రక్షకుడు మోను మానేసర్ ఈ యాత్రలో పాల్గొంటారని వదంతులు రావడంతో ఈ ఘర్షణలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఈ ఘర్షణలకు కారణం జై భారత్ మాత వాహిని చీఫ్ దినేశ్ భారతి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో అని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నుహ్‌లో ప్రారంభమైన ఘర్షణలు సోహ్నా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లకు విస్తరించడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేసింది. గురుగ్రామ్‌లో మంగళవారం పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ మాట్లాడుతూ, సంఘ విద్రోహ శక్తులు పటిష్టంగా కుట్ర పన్ని ఈ ఘర్షణలకు పాల్పడ్డాయని తెలిపారు.
ఢిల్లీ పోలీసులు మంగళవారం నుంచి గస్తీని ముమ్మరం చేశారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ జరుగుతున్న సంఘటనల ప్రభావం దేశ రాజధాని నగరంపై పడుతుందేమోననే ఉద్దేశంతో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్‌కు ఫోన్ చేసి, రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Special train: 5న వేలాంకన్నికి ప్రత్యేక రైలు
Train: తెలుగు రాష్ట్రాల మీదుగా.. నవంబరు 9న ‘దివాలి గంగా స్నాన యాత్ర’ రైలు