Karnataka polls: కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల...కుమారుడి స్థానంలో సిద్ధరామయ్య వరుణ సెగ్మెంట్ నుంచి పోటీ

ABN , First Publish Date - 2023-03-25T09:40:11+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థుల పేర్లను శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది....

Karnataka polls: కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల...కుమారుడి స్థానంలో సిద్ధరామయ్య వరుణ సెగ్మెంట్ నుంచి పోటీ
Karnataka Congress 1st list announced

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థుల పేర్లను శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.(Karnataka polls) కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) మైసూరులో వరుణ(Varuna) నుంచి పోటీ చేయనున్నారు.(Congress 1st list of candidates)కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Congress President Mallikarjun Kharge) కుమారుడు ప్రియాంక్ ఖర్గే చితపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు.

బబలేశ్వర్‌, గాంధీనగర్‌ నియోజకవర్గాల నుంచి ఎంబీ పాటిల్‌, దినేష్‌ గుండూరావులకు టిక్కెట్లు ఇచ్చారు. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటరమణప్పను పక్కనపెట్టి కొత్త అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ ఇచ్చింది.బీజేపీని వీడిన ఎమ్మెల్సీ పుట్టన్న రాజాజీనగర్‌ నుంచి టికెట్‌ పొందగా, దేవనహళ్లి నుంచి కేంద్ర మాజీ మంత్రి కేహెచ్‌ మునియప్ప పోటీ చేయనున్నారు.మైసూరులోని వరుణకు ప్రస్తుతం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Swara Bhasker: ప్రగ్యా ఠాకూర్ ఎంపీగా ఎలా కొనసాగుతున్నారు?సినీనటి స్వరభాస్కర్ సంచలన ట్వీట్

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు సిద్ధరామయ్య ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీకే శివకుమార్ ఇప్పటికే కనకపుర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.గతంలో సిద్ధరామయ్య తన సొంత నియోజకవర్గమైన వరుణ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సూచించారు.2018లో బాగల్‌కోట్‌లోని బాదామి నుంచి గెలిచినప్పటికీ మైసూరులోని చాముండేశ్వరి నుంచి ఓడిపోయారు.మరికొద్ది రోజుల్లో మే నాటికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Updated Date - 2023-03-25T09:40:11+05:30 IST