Share News

Chhattisgarh: కాంగ్రెస్ తొలి జాబితా ఎప్పుడో చెప్పిన సీఎం

ABN , First Publish Date - 2023-10-14T19:14:20+05:30 IST

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చత్తీస్‌గఢ్ కాంగ్రెస్అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శనివారంనాడు తెలిపారు.

Chhattisgarh: కాంగ్రెస్ తొలి జాబితా ఎప్పుడో చెప్పిన సీఎం

రాయపూర్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చత్తీస్‌గఢ్ (Chhattisgarh) కాంగ్రెస్ (Congress) అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) శనివారంనాడు తెలిపారు. అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేస్తామని, రెండో జాబితా తరువాత విడుదలవుతుందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. సూచనలు, సర్వేలను పరిగణనలోకి తీసుకుని లిస్ట్ ఖరారు చేస్తున్నామని చెప్పారు. గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.


ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రమణ్ సింగ్ పోటీ చేస్తున్న రాజ్‌నాథ్‌గావ్‌లో కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ, పార్టీ జాబితా బయటకు రాగానే అభ్యర్థి పేరు, పార్టీ వ్యూహం ఏమిటో తెలుస్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పోటీ చేస్తున్నది బీజేపీ కాదని, రమణ్ సింగ్, ఆయన బృందం మాత్రమేనని అన్నారు. టిక్కెట్ల పంపిణీలో ఆయన పాత్ర చాలా స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని 15 ఏళ్ల పాటు లూటీ చేసిందెవరో ఛత్తీస్ గఢ్ ప్రజలకు బాగా తెలుసునని భూపేష్ బఘెల్ విమర్శించారు. జేసీసీ (J), బహుజన్ సమాజ్ పార్టీ మధ్య పొత్తు ముగిసిందని, గోంద్వానా గణతంత్ర పార్టీతో బీఎస్‌పీ పొత్తు పెట్టుకుందని చెప్పారు. అయితే బీఎస్‌పీ బీజేపీ పక్షమేనని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీకి టీమ్ బీ‌గా అభివర్ణించారు. కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోందని ఆరోపించారు.


ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత జరిగే 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2018లో 19 స్థానాలు గెలుచుకుంది. రాజ్‌నంద్‌దావ్‌లో మాత్రం రమణ్ సింగ్ గెలిచారు. 2003 నుంచి 2018 వరకూ రమణ్‌సింగ్ ముఖ్యమంత్రిగా చేశారు. కాగా, నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతలుగా ఈసారి పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-10-14T19:14:20+05:30 IST