Rahul Gandhi : రాహుల్ గాంధీ న్యూ లుక్స్... చూసి తీరాల్సిందే...
ABN , First Publish Date - 2023-03-01T10:30:58+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) న్యూ లుక్స్‌ను చూసి ఆ పార్టీ నేతలు మురిసిపోతున్నారు. భారత్ జోడో యాత్ర
లండన్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) న్యూ లుక్స్‌ను చూసి ఆ పార్టీ నేతలు మురిసిపోతున్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా దృఢంగా, శక్తిమంతంగా (Rugged Looks) కనిపించారని, ఇప్పుడు ఆయన నగిషీ చెక్కిన శిల్పంలా నాజూకుగా ఉన్నారని సంబరపడుతున్నారు. నవతరం రాజకీయవేత్తకు సరైన ఉదాహరణ ఆయనేనని చెప్తున్నారు.
వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ బ్రిటన్ చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన నెరసిన గెడ్డంతో కనిపించారు. ఇప్పుడు గెడ్డాలు, మీసాలు, తల కత్తిరించుకున్నారు. తెలుపు రంగులోని టీ-షర్ట్‌తో కాకుండా సూటు, టై ధరించారు. ఈ కొత్త అవతారంలో ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం (Learning to listen in the 21st century) అనే అంశంపై ప్రసంగిస్తారని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇచ్చిన ట్వీట్‌లో తెలిపింది. ఈ ఫొటోలను కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తెలుపు రంగు టీ-షర్ట్ ధరించిన సంగతి తెలిసిందే. ఐదు నెలలపాటు దట్టమైన గెడ్డాలు, మీసాలతో ఆయన దర్శనమిచ్చారు.
ఇవి కూడా చదవండి :
Naveen Case : ఒకరికి తెలియకుండా మరొకరితో యువతి ప్రేమాయణం.. యువతి సెల్‌ఫోన్‌లో షాకింగ్ విషయాలు..
New Zealand: పట్టపగలే భారతీయుడి దుకాణంలో దొంగల బీభత్సం.. ఆందోళనలో భారతీయ సమాజం..!