Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ యాత్రలో విషాదం
ABN , First Publish Date - 2023-01-14T10:20:29+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో శనివారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. జలంధర్ లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు, కాంగ్రెస్ నేత చౌదరి సంతోష్ సింగ్ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని ఫిలౌర్‌లో రాహుల్ గాంధీతోపాటు పాదయాత్రలో నడుస్తుండగా ఈ విషాదం జరిగింది. ఆయన గుండె కొట్టుకునే వేగం పెరగడంతో అకస్మాత్తుగా అస్వస్థులయ్యారు. వెంటనే ఆయనను ఫగ్వారాలోని విర్క్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
రాహుల్ గాంధీ యాత్రకు విరామం ఇచ్చి, చౌదరి సంతోష్‌ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళారు. యాత్రకు శనివారం విరామం ప్రకటించారు.