Share News

CWC meeting: సీడబ్ల్యూసీ సమావేశానికి ఖర్గే పిలుపు...ఎప్పుడంటే..?

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:33 PM

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతోంది. ఈనెల 21వ తేదీన ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తారు.

CWC meeting: సీడబ్ల్యూసీ సమావేశానికి ఖర్గే పిలుపు...ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశమవుతోంది. ఈనెల 21వ తేదీన ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తారు.


కాగా, సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు, కీలకమైన ఇండియా (INDIA) కూటమి సమావేశం డిసెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో జరుగనుంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం, ఆ రెండు రాష్ట్రాలను బీజేపీ గెలుచుకోవడంతో పాటు మధ్యప్రదేశ్‌‌లో అధికారాన్ని నిలబెట్టుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందీ భాషా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఖంగుతినగా, బీజేపీలో ఉత్సాహం రెట్టింపైంది. మూడు రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్‌ను నిరాశపరిచినప్పటికీ తెలంగాణలో విజయం సాధించడం ఆ పార్టీకి ఒకింత ఊరటైంది.

Updated Date - Dec 17 , 2023 | 09:40 PM