Money laundering case : ఢిల్లీ కోర్టులో మనీశ్ సిసోడియాకు చుక్కెదురు
ABN , First Publish Date - 2023-04-05T16:57:33+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో ఉపశమనం లభించలేదు. మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 17 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనను మార్చి 9న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం (Delhi excise policy case) రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ ఆయనను ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన తిహార్ జైలులో ఉన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపణల ప్రకారం, మనీశ్ సిసోడియా ఢిల్లీ మద్యం విధానం, మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు ఆటంకం కలిగించడం కోసం డిజిటల్ సాక్ష్యాధారాలను, అదేవిధంగా 14 ఫోన్లను ధ్వంసం చేశారు. దర్యాప్తునకు చాలా ముఖ్యమైన, ఆయనకు మాత్రమే తెలిసిన అంశాలను ఆయన వెల్లడించడం లేదు.
ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం కేసులో మనీశ్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 17 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమికంగా చూసినపుడు నేరపూరిత కుట్రకు రూపశిల్పి సిసోడియాయేనని వెల్లడవుతోందని కోర్టు తెలిపింది.
సిసోడియా తరపు న్యాయవాది వివేక్ జైన్ బుధవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు వినిపిస్తూ, సిసోడియాపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రకారం కేసు వెల్లడి కాలేదని చెప్పారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 3 ప్రకారం నేరం వెల్లడైనపుడు మాత్రమే ఆ చట్టంలోని సెక్షన్ 45 వర్తిస్తుందని చెప్పారు. సిసోడియా లేదా ఆయన కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లోకి కనీసం ఒక పైసా అయినా రాలేదన్నారు. దర్యాప్తు అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేశారని, బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారని చెప్పారు. వారు ఆయన స్వస్థలానికి కూడా వెళ్లారన్నారు. ఆయనకు వ్యతిరేకంగా మనీలాండరింగ్‌కు సంబంధించి ఎటువంటి ఆరోపణలు లేవన్నారు.
మనీలాండరింగ్ కేసులో బెయిలు కోసం మనీశ్ సిసోడియా చేసిన దరఖాస్తుపై తదుపరి విచారణ ఏప్రిల్ 12న జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
Supreme Court : మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Rahul Vs Scindia : రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింథియా మండిపాటు