Pragati Maidan Tunnel Robbery: ఢిల్లీలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్, 1,578 మంది కస్టడీ

ABN , First Publish Date - 2023-06-27T13:04:04+05:30 IST

దేశరాజధానిలోని ప్రగతి మైదాన్ సొరంగంలో పట్టపగలే నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక కారును అడ్డుకుని తుపాకీతో రూ.2 లక్షలు దొచుకున్న ఘటన సంచలనం సృష్టించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నేరాల అదుపునకు సోమవారం రాత్రి పెద్దఎత్తున ''నైట్ పెట్రోలింగ్'' నిర్వహించారు. 1,578 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.

Pragati Maidan Tunnel Robbery: ఢిల్లీలో ముమ్మరంగా నైట్ పెట్రోలింగ్, 1,578 మంది కస్టడీ

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ప్రగతి మైదాన్ సొరంగంలో పట్టపగలే నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక కారును అడ్డుకుని తుపాకీతో రూ.2 లక్షలు దొచుకున్న ఘటన సంచలనం సృష్టించడంతో ఢిల్లీ పోలీసులు (Delhi police) అప్రమత్తమయ్యారు. నేరాల అదుపునకు సోమవారం రాత్రి పెద్దఎత్తున ''నైట్ పెట్రోలింగ్'' (Night Patrolling) నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాల తనిఖీలు పట్టారు. పలువురుని నిర్బంధంలోకి (Detained) తీసుకున్నారు. వాహనాలు సీజ్ (Vehicles seize) చేశారు.

ముందస్తు కస్టడీలో 1,578

సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జరిపిన నైట్‌ పెట్రోల్‌‌లో భాగంగా 1,587 మందిని ముందస్తు కస్టడీలోకి తీసుకున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 107/151 కింద వీరిని నిర్బంధంలోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. చౌదిని చౌక్, రెడ్‌పోర్ట్, కన్నాట్ ప్లేస్ సహా నార్త్, సెంట్రల్ ఢిల్లీలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 2,000కు పైగా వాహనాలను కూడా సీజ్ చేశారు. నేరాలను అదుపు చేసేందుకు ఈ ఆపరేషన్ చేపట్టామని, ఇందులో భాగంగాపలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్‌పరీ దీపేంద్ర పాఠక్ తెలిపారు. ఢిల్లీలో పెరుగుతున్న నేరాలపై అడిగినప్పుడు, గత కొన్నేళ్ల గణాంకాలను చూసినప్పుడు నేరాల్లో పెరుగుదల లేదన్నారు. ఎలాంటి నేర ఘటనలు జరిగినా వెంటనే వాటిని సమర్ధవంతంగా పరిష్కరిస్తున్నామని, నేరాల అదుపులో పోలీసులు కఠిన విధానాలను అనుసరిస్తున్నారని ఆయన చెప్పారు.

తుపాకితో దోపిడీ ఘటనలో ఐదుగురి అరెస్టు

ప్రగతి మైదాన్ టన్నెల్‌లో ఒక డెలివరీ ఏజెంట్‌ను, అతని సహచరుడిని తుపాకితో బెదరించి దోపిడీకి పాల్పడిన ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఐదుగురు వ్యక్తులు అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-06-27T13:04:04+05:30 IST