Karnataka CM Tussle : కాసేపట్లో ఢిల్లీకి డీకే శివ కుమార్
ABN , First Publish Date - 2023-05-16T09:12:20+05:30 IST
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) పదవి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠత క్షణక్షణం పెరుగుతోంది. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) పదవి ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠత క్షణక్షణం పెరుగుతోంది. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివ కుమార్ (DK Shiva Kumar) నువ్వా-నేనా అన్నట్లు పోరాడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కరుణాకటాక్ష వీక్షణాలు ఎవరిపైన ప్రసరిస్తాయో చూడాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డీకే శివ కుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ (DK Suresh) మాట్లాడుతూ, శివ కుమార్ మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళతారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అంతే స్థాయిలో లాబీయింగ్ జరుగుతోంది. సిద్ధరామయ్య, శివ కుమార్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం సోమవారం చర్చలకు పిలిచింది. వీరిద్దరే ఈ పదవికి పోటీలో ముందు వరుసలో ఉన్నారు. అయితే శివ కుమార్ అనారోగ్య కారణాలను చూపుతూ, సోమవారం చివరి క్షణంలో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా కొందరు వినిపిస్తున్నారు.
సోమవారం సాయంత్రం డీకే సురేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge)ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ, తన సోదరుడు శివ కుమార్ మంగళవారం ఢిల్లీ వెళ్తారని చెప్పారు.
కర్ణాటకలోని 224 శాసన సభ స్థానాల్లో 135 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ బాధ్యతను ఖర్గేకు అప్పగిస్తూ ఆదివారం ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఇవి కూడా చదవండి :
Amaravati: నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం
Liquor stores: 500 మద్యం దుకాణాల మూత.. కారణమేంటో తెలిస్తే..