DK Shivakumar: ఉప ముఖ్యమంత్రికి ఊరట లభించిందోచ్..
ABN , First Publish Date - 2023-06-03T11:46:07+05:30 IST
ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar)కు ఊ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar)కు ఊరట లభించింది. డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా సీబీఐ(CBI) విచారణకు మధ్యంతర నిలుపుదలను హైకోర్టు ధర్మాసనం మరింతకాలం పొడిగించింది. సీబీఐ విచారణలపై స్టే విధించిన ఏకసభ్య ధర్మాసనం ఏ బెంచ్ ద్వారా విచారణ జరిపించాలనే అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోదలిచారు. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అవగాహన కోసం కేసును బదిలీ చేశారు. మే నెలాఖరుదాకా విచారణ జరపకుండా స్టే ఉండేది. ప్రస్తుతం మూడోసారి స్టేను పొడిగించారు. సీబీఐ 2020 అక్టోబరు 3న అవినీతి వ్యతిరేక చట్టానికి అనుగుణంగా క్రిమినల్ కేసు నమోదు చేసింది. సదరు కేసు విచారణను రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణపై విధించిన స్టేను శుక్రవారం పొడిగించారు. కాగా డీకే శివకుమార్‌కు ఉపశమనం లభించినట్టే తమ్ముడు, ఎంపీ డీకే సురేశ్‌కు ఊరట లభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ డబ్బులు పంపిణీ చేస్తున్నారని భద్రావతి పేపర్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయమూర్తి ఎం నాగప్రసన్న రద్దు చేశారు. అప్పట్లో డీకే సురేశ్‌తోపాటు ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చార్జ్‌షీట్‌ను కొట్టివేయాలని డీకే సురేశ్ సహా మిగిలినవారు కోర్టును ఆశ్రయించిన మేరకు విచారణ జరిపిన ధర్మాసనం కేసును కొట్టివేసింది.