Karnataka Elections: అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలపై ఈసీ కన్నెర్ర

ABN , First Publish Date - 2023-05-03T20:39:41+05:30 IST

సోనియాగాంధీని (Sonia Gandhi) విషకన్య (vishkanya) అంటూ సంబోధించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్‌కు (Basangouda Yatnal) ఈసీ (EC) నోటీసులిచ్చింది.

Karnataka Elections: అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలపై ఈసీ కన్నెర్ర
EC issues notice to BJP leader B P Yatnal

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని (Sonia Gandhi) విషకన్య (vishkanya) అంటూ సంబోధించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్‌కు (Basangouda Yatnal) ఈసీ (EC) నోటీసులిచ్చింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నాలాయక్ బేటా (Useless son) అని సంబోధించిన ప్రియాంక్ ఖర్గేకు కూడా ఈసీ నోటీసులిచ్చింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Prime Minister Narendra Modi) ప్రియాంక్ ఖర్గే తండ్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ విషపామని (Poisouns snake) చెప్పారు. ఆ తర్వాత తాను అన్నది నరేంద్ర మోదీని కాదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను అన్నానని, ఎవరైనా బాధపడి ఉంటే సారీ అని ఖర్గే చెప్పారు. అయితే ఈసీ అధికారులు ఖర్గేకు మాత్రం ఇంకా ఎలాంటి నోటీసులూ జారీ చేయలేదు.

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 113.

Updated Date - 2023-05-03T20:39:44+05:30 IST