Kerala:లైఫ్ మిషన్ కుంభకోణం కేసులో సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరెస్ట్
ABN , First Publish Date - 2023-02-15T10:07:04+05:30 IST
కేరళ రాష్ట్రంలో జరిగిన లైఫ్ మిషన్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు ప్రారంభించారు...
తిరువనంతపురం(కేరళ): కేరళ రాష్ట్రంలో జరిగిన లైఫ్ మిషన్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు ప్రారంభించారు.(Kerala) కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి(CMs former principal secretary) ఎం శివశంకర్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ (ED arrest)చేశారు.
ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో మరో శ్రద్ధా వాకర్ తరహా దారుణ హత్య
లైఫ్ మిషన్ కుంభకోణం కేసులో(Life Mission scam case) మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం శివశంకర్‌ను మూడు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు. లైఫ్ మిషన్ కార్యక్రమం కింద కేరళ ప్రభుత్వం ఇళ్లు లేని వారికి సొంత ఇళ్లు నిర్మించి ఇచ్చిన పథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. త్రిస్సూర్ వడక్కనచెరీ ప్రాంతంలో లైఫ్ మిషన్ పథకం కింద రూ.14.50 కోట్లతో 140 కుటుంబాలకు ఇళ్లు నిర్మించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి ద్వారా రెడ్ క్రెసెంట్ ద్వారా రూ.20కోట్ల గ్రాంటు వచ్చింది. మిగిలిన డబ్బుతో ఆసుపత్రి నిర్మించాలి.యునిటాక్ బిల్డర్స్‌కు భవనాల నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చారు.
ఇది కూడా చదవండి : Karnataka: కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ ప్రాజెక్టు కోసం నిందితులందరూ రూ.4.48 కోట్ల లంచం అందుకున్నారని యునిటాక్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ ఈపెన్ ఆరోపించారు. దీంతో కేరళ ప్రభుత్వం ఈ కేసుపై విచారణకు ఆదేశించింది.ఈ కేసులో నిందితులు స్వప్న సురేశ్, సరిత్, సీఎం పీఎస్‌లు శివశంకర్‌కు పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారు.