ED raids: సీఎం సలహాదారు నివాసంపై ఈడీ దాడులు.. మోదీపై సీఎం ఫైర్..!

ABN , First Publish Date - 2023-08-23T15:45:16+05:30 IST

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ జకీయ సలహాదారు వినోద్ వర్మ, రాయపూర్ ఓఎస్‌డీ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు దాడులు జరిపింది. ఈ ఇద్దరి నివాసాలపై ఈడీ బృందాలను దాడులకు పంపడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను ముఖ్యమంత్రి తప్పుపట్టారు.

ED raids: సీఎం సలహాదారు నివాసంపై ఈడీ దాడులు.. మోదీపై సీఎం ఫైర్..!

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) రాజకీయ సలహాదారు వినోద్ వర్మ, రాయ్‌పూర్‌లోని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు దాడులు జరిపింది. ఈ ఇద్దరి నివాసాలపై ఈడీ బృందాలను దాడులకు పంపడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను ముఖ్యమంత్రి తప్పుపట్టారు.


నా పుట్టినరోజు గిఫ్ట్...

''గౌరవనీయులైన ప్రధాన మంత్రికి, అమిత్‌షాకు... నా పుట్టినరోజున నా రాజకీయ సలహాదారు, ఓఎస్‌డీ, సన్నిహితుల నివాసాలకు ఈడీని పంపడం ద్వారా విలువైన కానుకలు ఇచ్చిన మీకు చాలాచాలా ధన్యవాదాలు'' అని సీఎం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దుర్గ్‌లోని ఓ వ్యాపారవేత్త నివాసంలో కూడా ఈడీ టీమ్ సోదాలు జరిపింది. అయితే, ఈ దాడులకు ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.


పారామిలటరీ సిబ్బంది పహరా..

దేవేంద్ర నగర్‌లోని ఆఫీసర్స్ కాలనీలో ఉంటున్న వినోద్ వర్మ ఇంటి వద్ద ఉదయం పలువురు పారామిలటరీ సిబ్బంది కనిపించారు. ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించి బొగ్గు కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, డిల్లా మినరల్ ఫౌండేషన్ ఫండ్‌లో అవకతవకలు, ఆన్ లైట్ బెట్టింగ్ అప్లికేషన్ వంటి వివిధ కేసులను ఈడీ విచారిస్తోంది. గత రెండు రోజులుగా, ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించి రాయపూర్, దుర్గ్‌లలో ఈడీ గాలింపు చర్యలు జరుపుతోంది.

Updated Date - 2023-08-23T15:45:16+05:30 IST