Delhi Liquior Scam Case: ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా రిజైన్
ABN , First Publish Date - 2023-03-12T17:54:27+05:30 IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquior Scam Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ (ED) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా (Nitesh Rana) తన పదవికి రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquior Scam Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ (ED) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా (Nitesh Rana) తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2015 నుంచి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ (congress) నాయకుడు డీకే శివకుమార్, ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ (Laaluprasad yadav), అతని కుటుంబం, టీఎంసీ (TMC) నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్‌లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లపై జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు మరియు హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాదులపై కేసుల వంటి విషయాలలోను రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు.
ఎయిర్ ఇండియా స్కామ్, విజయ్ మాల్యా, నీవర్ మోడీ, మెహుల్ చోక్సీ, భూషణ్ పవర్ అండ్ స్టీల్, రాన్ బాక్సీ రెలిగేర్ మోసం, స్టెర్లింగ్ బయోటెక్ స్కాం, పశ్చిమ బెంగాల్ పశువులపై మనీలాండరింగ్ కేసులు వంటి హై ప్రొఫైల్ కేసుల్లోనూ రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించి, గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ “ లీగల్ పవర్ లిస్ట్ ఆఫ్ 2020” లోనూ రాణాకి చోటు దక్కింది.