Eknath Shinde: అదను చూసి ఉద్ధవ్ థాకరేకు షాకిచ్చిన ఏక్‌నాథ్ శిండే
ABN , First Publish Date - 2023-03-13T23:20:19+05:30 IST
శివసేన(Shiv Sena) అధ్యక్షుడు, మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే(Eknath Shinde) శివసేన ఉద్ధవ్ వర్గం నాయకుడు ఉద్ధవ్ థాకరే(UddhavThackeray)కు షాకిచ్చారు.
ముంబై: శివసేన(Shiv Sena) అధ్యక్షుడు, మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే(Eknath Shinde) శివసేన ఉద్ధవ్ వర్గం నాయకుడు ఉద్ధవ్ థాకరే(UddhavThackeray)కు షాకిచ్చారు. ఉద్ధవ్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న మాజీ మంత్రి సుభాష్ దేశాయ్(Subhash Desai) కుమారుడు భూషణ్ దేశాయ్(Bhushan Desai)ను శివసేనలో చేర్చుకున్నారు. ముంబైలో ఏక్‌నాథ్ శిండే సమక్షంలో భూషణ్ శివసేనలో చేరారు. బాల్ థాకరే ప్రధాన అనుచరులంతా క్రమంగా తమ శివసేనలోకి వచ్చేస్తున్నారని శిండే చెప్పారు. మిగిలిన వారు కూడా త్వరలోనే వచ్చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించింది. అంతేకాదు.. 1966లో శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ కూడా శిందే వర్గానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్ శుక్రవారం 78 పేజీల ఆదేశాలు విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ(ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా శిండే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ తర్వాత.. ఉద్ధవ్, శిండే వర్గాల మధ్య శివసేన పేరు, పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే పేరును వాడుకోవడం, పార్టీ గుర్తు విషయంలో ఆదిపత్య పోరు మొదలైంది. ఆర్నెల్ల క్రితం తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని, పార్టీ గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే ఈసీఐకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీఐ త్రిసభ్య కమిషన్ ఏర్పాటైంది. ఉద్ధవ్, శిందే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తుది ఆదేశాలను జారీ చేసింది. శిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆర్నెల్ల క్రితం కమిషన్ ఏర్పాటవ్వగానే.. శివసేన పార్టీ పేరు, గుర్తును ఈసీఐ ఫ్రీజ్ చేసింది. ఉద్ధవ్ వర్గం ఈ పిటిషన్ దాఖలు చేసినప్పుడు.. 2018 నాటి పార్టీ రాజ్యాంగ సవరణను ఉటంకించింది. 1999 నాటి శివసేన పార్టీ రాజ్యాంగమే ఈసీఐ రికార్డుల్లో ఉంది. అందుకే.. ఉద్ధవ్ వర్గం లేవనెత్తుతున్న 2018 పార్టీ రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోలేం’’ అని కమిషన్ తన ఆదేశాల్లో తేల్చిచెప్పింది. శివసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో 76 శాతం మంది శిందే వర్గంలో ఉన్నారని, ఉద్ధవ్ వైపు 23.5 శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శిండే వర్గానిదే అసలైన శివసేన అని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.