Karnataka Elections: విధుల్లో 4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-05-09T21:52:47+05:30 IST

కర్ణాటక అసెంబ్లీలోని (Karnataka Assembly) 224 స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Karnataka Elections: విధుల్లో 4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
Karnataka Assembly elections

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలోని (Karnataka Assembly) 224 స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2613 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల సంఘం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసింది.

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.24 కోట్లకు పైగా ఉండగా.. వీరిలో 2.6 కోట్ల మంది మహిళా ఓటర్లు, 4,751మంది ట్రాన్స్‌జెండర్లు. 58,282 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.24 కోట్ల ఓటర్లలో 5.60 లక్షల మంది దివ్యాంగులు. 80 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 12.15 లక్షలు కాగా.. వీరిలో వందేళ్ల వయసు పైబడిన ఓటర్లు 16 వేల మంది వరకున్నారు. 80 ఏళ్లుపైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటేసే సౌకర్యం కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరు వరకూ పోలింగ్ జరగనుంది. 58, 545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

1985 నుంచి ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబట్టే సంప్రదాయం కన్నడనాట లేకపోవడంతో అన్ని పార్టీల నేతల్లోనూ గుబులు నెలకొంది.

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ నెంబర్ 113.

ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై షిగ్గావ్ నుంచి తలపడుతున్నారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వరుణ నుంచి, కనకపుర నుంచి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ చేస్తున్నారు. చెన్నపట్న నుంచి జేడీఎస్ అధినేత కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు.

బుధవారం ఒకే దశలో పోలింగ్‌ జరుగుతుంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-05-09T21:52:50+05:30 IST