Uddhav Thackeray: ఉద్ధవ్‌కు ఊహించని షాక్...

ABN , First Publish Date - 2023-03-15T20:20:42+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా భారత ఎన్నికల కమిషన్ ఇటీవల గుర్తించడంతో..

Uddhav Thackeray: ఉద్ధవ్‌కు ఊహించని షాక్...

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా భారత ఎన్నికల కమిషన్ (ECI) ఇటీవల గుర్తించడంతో ఖంగుతిన్న మాజీ సీఎం, శివసేన (UBT) నేత ఉద్ధవ్ థాకరే‌కు (Uddhav Thackeray) మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి దీపక్ సావంత్ (Deepak Sawant) బుధవారంనాడు ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు. థాకరే కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా దీపక్‌ సావంత్‌కు పేరుంది.

ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేసిన సావంత్ మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేయాలన్నదే తన కోరిక అని, పదవులు కాదని సావంత్ తెలిపారు. ఇదే విషయాన్ని ఏక్‌నాథ్‌ షిండేకు ఒక లేఖలో తెలియజేశానని, అందుకు షిండే ఇవాళ ఆమోదం తెలియజేశారని చెప్పారు. సావంత్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు షిండే తెలిపారు. సావంత్ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పారు. ఐక్య శివసేన ప్రభుత్వంలో ఎంఎల్‌సీగా ఉన్న సావంత్ 2014 నుంచి 2018 వరకూ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, గత సోమవారంనాడు థాకరేకు అత్యంత విశ్వసనీయుడైన సుభాష్ దేశి కుమారుడు భూషణ్ దేసి సైతం షిండే శివసేనలో చేరారు.

Updated Date - 2023-03-15T20:20:42+05:30 IST