Pulwama attack: పుల్వామా దాడి జరిగి నేటికి నాలుగేళ్లు... అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-02-14T12:08:12+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నాలుగేళ్లు అయింది....

Pulwama attack: పుల్వామా దాడి జరిగి నేటికి నాలుగేళ్లు... అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ
Pulwama attack PM Modi remembers martyrs

పుల్వామా : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నాలుగేళ్లు అయింది. (Pulwama attack) 2019 వ సంవత్సరం ఫిబ్రవరి 14వతేదీన 40 మంది భారత జవాన్లు అమరులైన నాలుగేళ్ల తర్వాత ‘‘జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ప్రధాని మోదీ (PM Modi remembers martyrs)మంగళవారం ట్విట్టర్‌లో వారి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.(Prime Minister Narendra Modi)

ఇది కూడా చదవండి : Pakistan: పాకిస్థాన్‌లో లీటర్ పాలు, కిలో చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..!

మసూద్ అజార్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.జమ్మూ నుంచి శ్రీనగర్‌కు 2,500 మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందిని ప్రయాణం చేస్తుండగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు.

ఇది కూడా చదవండి : Demolition Drive: కాన్పూర్‌లో ఇళ్ల కూల్చివేతల్లో దారుణం...తల్లీ, కుమార్తె సజీవ దహనం

పుల్వామా దాడి(PULWAMA ATTACK 2019) తర్వాత భారత వాయుసేన దళం సర్జికల్ స్ట్రైక్‌ చేసింది.బాలాకోట్ పై వైమానిక దాడి(BALAKOT AIRSTRIKE) చేసింది.2020వ సంవత్సరంలో ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పుల్వామా దాడి ఘటనలో 19 మంది నిందితులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి : Valentines Day: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కుక్కలకు పెళ్లి...హిందూ సంస్థ వినూత్న నిరసన

జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై భారత వాయుసేన దాడి చేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చామని భారత్ ప్రకటించింది.భారతదేశం, పాకిస్తాన్ జెట్‌ల మధ్య జరిగిన పోరాటంలో ఒక భారతీయ మిగ్ -21 పాకిస్థాన్ లో పడింది. మిగ్ పైలట్ అభినందన్ వర్థమాన్ పాక్ గ్రామస్థులకు చిక్కాడు.వర్ధమాన్‌ను పాక్ సైనికులు రక్షించి, ప్రథమ చికిత్స చేసి ప్రశ్నించారు. అనంతరం పాక్ వర్ధమాన్ ను తమ చెర నుంచి విడుదల చేసింది.

Updated Date - 2023-02-14T12:51:46+05:30 IST