Governor: లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2023-07-23T10:24:48+05:30 IST
వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, కేంద్రంలోని బీజేపీ పాలకులు నిర్ణయం తీసుకుంటా
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, కేంద్రంలోని బీజేపీ పాలకులు నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Governor Dr. Tamilisai Soundararajan) అన్నారు. పుదుచ్చేరి కదిర్ గ్రామంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో యేటా 180 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాలు పొందుతున్నారు. ప్రస్తుతం ఆ కళాశాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటోంది. దీనికి తోడు అలా్ట్ర సౌండ్ చికిత్సలకు సంబంధించి పాఠాలు బోధించే అధ్యాపకులు కూడా లేరు. ఈ వివరాలు గవర్నర్ తమిళిసై తెలుసుకుని తానే ఆ కళాశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించనున్నట్లు ప్రకటించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రస్తుతం రెండు రాష్ట్రాల గవర్నర్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నానని, ఎంపీ పదవికి పోటీ చేసే విషయంపై పైనున్న దేవుడు, పైనున్న పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తనకు తానుగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేనని ఆమె పేర్కొన్నారు.