Hemant Soren:సుప్రీంను ఆశ్రయించిన ముఖ్యమంత్రి.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-09-17T18:25:29+05:30 IST

మ‌నీలాండ‌రింగ్(Money laundering) కేసులో ఈడీ స‌మ‌న్ల‌ను స‌వాల్ చేస్తూ జార్ఖండ్( Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గత నెలలో స‌మ‌న్లు ఉప‌సంహ‌రించుకోవాల‌ని, లేదంటే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తాన‌ని సోరెన్ ఈడీ(Enforcement Directorate)కి తేల్చి చెప్పారు.

Hemant Soren:సుప్రీంను ఆశ్రయించిన ముఖ్యమంత్రి.. ఎందుకంటే?

ఢిల్లీ : మ‌నీలాండ‌రింగ్(Money laundering) కేసులో ఈడీ స‌మ‌న్ల‌ను స‌వాల్ చేస్తూ జార్ఖండ్( Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ (CM Hemant Soren) సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గత నెలలో స‌మ‌న్లు ఉప‌సంహ‌రించుకోవాల‌ని, లేదంటే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తాన‌ని సోరెన్ ఈడీ(Enforcement Directorate)కి తేల్చి చెప్పారు. హేమంత్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమ‌వారం విచారించ‌నుంది. హేమంత్ సోరెన్‌కు ఈడీ సెప్టెంబర్ 23న హాజరు కావాలంటూ సమన్లు ​​జారీ చేసింది. కేసుకు సంబంధించి వివరణ ఇస్తూ గతంలో సీఎం ఈడీకి ఓ లేఖ రాశారు. తాను ఈడీకి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చానని అందులో పేర్కొన్నారు.


ఈడీ తనకు ఎలాంటి స‌మాచారం అవ‌స‌ర‌మైనా ఆ డాక్యుమెంట్లను ప‌రిశీలించ‌వ‌చ్చ‌ని లేఖలో ఉంది. జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో అక్ర‌మ మైనింగ్ కేసుకు సంబంధించి మ‌నీల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో ఆ రాష్ట్ర సీఎం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) బలపడుతుండటంతో బీజేపీ(BJP) భయపడుతోందని ఏం చేయాలో అర్థం కాక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపైకి ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. 2020లో త‌న తండ్రి శిబు సోరెన్‌పై లోక్‌పాల్ ఆదేశాల‌కు అనుగుణంగా చేప‌ట్టిన విచార‌ణ‌లో మొత్తం ఆస్తుల వివ‌రాలు సీబీఐ(CBI)కి అంద‌చేశాన‌ని అన్నారు. ఆ డీటెయిల్స్ ని సీబీఐ నుంచి పొందవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం ఆపాలని ఆయన అన్నారు.

Updated Date - 2023-09-17T18:33:35+05:30 IST