High Court: హైకోర్టు సంచలన కామెంట్స్.. ఆ హక్కు మీకెక్కడిది..
ABN , First Publish Date - 2023-05-17T13:16:12+05:30 IST
విద్యార్థుల సర్టిఫికెట్లు పట్టుకొనేందుకు కళాశాల యజమాన్యాలకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
పెరంబూర్(చెన్నై): విద్యార్థుల సర్టిఫికెట్లు పట్టుకొనేందుకు కళాశాల యజమాన్యాలకు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు మదురై డివిజన్ బెంచ్(High Court Madurai Division Bench) స్పష్టం చేసింది. వాసుదేవనల్లూర్లోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం తాను ఫీజు చెల్లించదని, తన సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ ఓ విద్యార్థిని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారించిన హైకోర్టు, ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉండడానికి పాఠశాల యాజమాన్యం, అప్పులిచ్చే వారు కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తూ, బాధిత విద్యార్థినికి 10 రోజుల్లో సర్టిఫికెట్లు అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది.