CBI Chief Post : సీబీఐ చీఫ్ పదవికి కర్ణాటక ఐపీఎస్ అధికారి ఎంపిక?

ABN , First Publish Date - 2023-05-14T13:05:26+05:30 IST

కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ నియామకానికి కసరత్తు జరుగుతోంది. ఈ ఎంపిక కోసం ఏర్పాటైన

CBI Chief Post : సీబీఐ చీఫ్ పదవికి కర్ణాటక ఐపీఎస్ అధికారి ఎంపిక?

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation-CBI) డైరెక్టర్ నియామకానికి కసరత్తు జరుగుతోంది. ఈ ఎంపిక కోసం ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ముగ్గురు అధికారులతో ఓ జాబితాను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (DY Chandrachud), లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు. శనివారం సాయంత్రం ఈ కమిటీ సమావేశమై, ఈ ముగ్గురు అధికారులను ఎంపిక చేసినట్లు తెలిసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్ సభ్యుడు పదవుల కోసం అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

తదుపరి సీబీఐ డైరెక్టర్ పదవి కోసం కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్య ప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఈ కమిటీ ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ రెండేళ్ల పదవీ కాలం మే 25తో ముగుస్తుంది. ఆయన తర్వాత ఈ స్థానంలో నియామకం కోసం ఎంపికైన ముగ్గురిలో ప్రవీణ్ సూద్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం కర్ణాటక డీజీపీ. ప్రవీణ్‌పై ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని, బీజేపీని కాపాడుతున్నారని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైనవారి పదవీ కాలం రెండేళ్లు. ఆ తర్వాత ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

Karnataka Election Results : అతి తక్కువ ఓట్లతో గెలుపు.. అవాక్కయిన ప్రత్యర్థులు..

Maharashtra : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. పలువురు పోలీసులకు గాయాలు..

Updated Date - 2023-05-14T13:05:26+05:30 IST