Himachal Pradesh : కులు జిల్లాలో కొండచరియ బీభత్సం.. కుప్పకూలిన ఏడు భవనాలు..
ABN , First Publish Date - 2023-08-24T13:41:07+05:30 IST
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. వరదలతో అతలాకుతలమైన ఈ రాష్ట్రంలో తాజాగా కొండచరియ విరిగిపడటంతో ఏడు బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని కాపాడటం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి.
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపం చల్లారడం లేదు. వరదలతో అతలాకుతలమైన ఈ రాష్ట్రంలో తాజాగా కొండచరియ విరిగిపడటంతో ఏడు బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని కాపాడటం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. కులు-మండీ హైవేపై వందలాది వాహనాలు చిక్కుకున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఇచ్చిన ట్వీట్‌లో, అన్ని (Anni), కులులలో పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాణిజ్య భవనం కుప్పకూలిపోవడానికి సంబంధించిన వీడియో తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. అధికారులు ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి, ఈ భవనాన్ని రెండు రోజుల క్రితమే ఖాళీ చేయించారని తెలిపారు.
సీనియర్ పోలీసు అధికారి సంజయ్ కుందు మాట్లాడుతూ, ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ భవనాన్ని ఇటీవలే ఖాళీ చేయించామన్నారు.
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఇప్పటికే అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3 : మధ్య తరగతి ప్రజల్లో ఆశలు రేపుతున్న చంద్రయాన్-3 విజయం
Russia : పుతిన్‌పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ ఓ చిల్లర దొంగ!