Himachal Rain Fury: హిమాచల్‌లో వర్షం బీభత్సం.. ఉప్పొంగుతున్న నదులు.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌లు..రోడ్లు..

ABN , First Publish Date - 2023-07-09T18:36:49+05:30 IST

ఈటానగర్: ఎడతెరిపి లేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగడంతో వరద బీభత్సం సృష్టిస్తోంది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమై ఐదుగురు మృతి చెందారు. వరద బీభిత్సం, కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విధ్వంసం దృశ్యాలు సోషల్ మీడియాలో కనిస్తున్నాయి.

Himachal Rain Fury: హిమాచల్‌లో వర్షం బీభత్సం.. ఉప్పొంగుతున్న నదులు.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌లు..రోడ్లు..

ఈటానగర్: ఎడతెరిపి లేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగడంతో వరద బీభత్సం సృష్టిస్తోంది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమై ఐదుగురు మృతి చెందారు. వరద బీభిత్సం, కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విధ్వంసం దృశ్యాలు సోషల్ మీడియాలో కనిస్తున్నాయి.

కులు జిల్లాలోని కసోల్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో అనేక కార్లు కొట్టుకుపోయినట్లు ఒక వీడియో చూపించింది.

మండి జిల్లాలో బియాస్ నది ఉధృతంగా ప్రవహించడంతో ఆటో-బంజార్‌ను కలిపే వంతెన కొట్టుకుపోయినట్లు మరో వీడియో చూపించింది.

బియాస్ నది పొంగి ప్రవహిస్తున్న నీరు మండి జిల్లాలోని పండోహ్ గ్రామంలోకి ప్రవేశించింది.

హిమాలయ రాష్ట్రంలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తుండటంతో బియాస్ నదిలో ఉప్పెన కారణంగా ప్రముఖ పంచవక్త్ర దేవాలయం మండి జిల్లా కూడా నీటిలో మునిగిపోయింది. భారీ వర్షాలు, తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా సిమ్లా-కల్కా రైళ్లు రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. భారీ వర్షాలతో కోటి సన్వారా రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ నీట మునిగింది.

Updated Date - 2023-07-09T18:36:49+05:30 IST