Same-Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసిన దేశాల జాబితా ఇదిగో!
ABN , First Publish Date - 2023-10-17T15:49:22+05:30 IST
దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెల్లడించింది.
ఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెల్లడించింది. ఈ విషయంలో న్యాయమూర్తుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు 3:2 మెజారిటీతో తుది తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించలేమని రాజ్యంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాకుండా వారి వివాహాలకు సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. అలాగే వారిపై ఎలాంటి వివక్ష చూపించకూడదని, వారి హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలని ఆదేశించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 33 దేశాలు స్వలింగ సంపర్క వివాహాలను చట్ట బద్దం చేశాయి. అందులో 23 దేశాలు ఓటింగ్ ద్వారా చట్టబద్దం చేయగా.. 10 దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి. మొట్టమొదటగా 2001లో నెదర్లాండ్స్ స్వలింగ సంపర్కులకు చట్టబద్దత కల్పించింది. చివరగా ఎస్టోనియా వారికి చట్టబద్ధత కల్పించింది.
చట్టబద్ధం చేసిన దేశాల జాబితా
నెదర్లాండ్స్-2001
బెల్జియం-2003
కెనడా-2005
స్పెయిన్-2005
దక్షిణాఫ్రికా-2006
నార్వే-2009
స్వీడన్-2009
ఐస్‌ల్యాండ్-2010
పోర్చుగల్-2010
అర్జెంటీనా-2010
డెన్మార్క్-2012
ఉరుగ్వే- 2013
న్యూజిలాండ్-2013
ఫ్రాన్స్-2013
బ్రెజిల్-2013
ఇంగ్లాండ్, వేల్స్-2014
స్కాట్లాండ్-2014
లక్సెంబర్గ్-2015
ఐర్లాండ్-2015
యునైటెడ్ స్టేట్స్-2015
గ్రీన్‌ల్యాండ్-2016
కొలంబియా-2016
ఫిన్లాండ్-2017
జర్మనీ-2017
మాల్టా-2017
ఆస్ట్రేలియా-2017
ఆస్ట్రియా-2019
తైవాన్-2019
ఈక్వెడార్-2019
ఐర్లాండ్-2020
కోస్టారికా-2020
స్విట్జర్లాండ్-2022
మెక్సికో- 2022
చిలీ-2022
స్లోవేనియా-2022
క్యూబా-2022
అండోరా-2023
ఎస్టోనియా-2024