IMD: ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
ABN , First Publish Date - 2023-07-09T12:37:30+05:30 IST
తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 12వ తేది వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ
ఐసిఎఫ్(చెన్నై): తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 12వ తేది వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. దక్షిణ దిశ గాలుల వేగంలో మార్పు కారణంగా రెండు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. రాజధాని నగరం చెన్నై(Chennai)లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన స్వల్ప వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.