Pakistan : పాకిస్థాన్ విషయంలో భారత్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-01-26T12:02:33+05:30 IST

అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భుట్టో, గాంగ్‌లకు భారత ప్రభుత్వం ఆహ్వానాలను అందజేసింది.

Pakistan : పాకిస్థాన్ విషయంలో భారత్ సంచలన నిర్ణయం
Pakistan Prime Minister Shehbaz Sharif

న్యూఢిల్లీ : గోవాలో మే నెలలో జరిగే షాంఘై సహకార సంఘం (SCO) సమావేశాలకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను ఆహ్వానించాలని భారత్ నిర్ణయించింది. ఈ సమావేశాలకు హాజరుకావాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను బుధవారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భుట్టో, గాంగ్‌లకు భారత ప్రభుత్వం ఆహ్వానాలను అందజేసింది. కానీ వీరు ఈ సమావేశాలకు హాజరయ్యేదీ, లేనిదీ ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు పదేళ్ల క్రితం అప్పటి పాకిస్థానీ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత పాకిస్థాన్ అగ్ర నేతలు భారత దేశంలో పర్యటించలేదు. షరీఫ్ కానీ, భుట్టో కానీ గోవా సమావేశాలకు హాజరవుతారో, లేదో చూడాలి.

మరికొద్ది రోజుల్లో ముంబైలో జరిగే ఎస్‌సీఓ చలన చిత్రోత్సవాల్లో పాకిస్థాన్ పాల్గొనడం లేదు. ఈ గ్రూప్‌లోని మిగిలిన దేశాలన్నీ తమ ఎంట్రీలను పంపించాయి.

Updated Date - 2023-01-26T12:02:37+05:30 IST