Share News

Jairam Ramesh: మూడు రాష్ట్రాలలో ఫలితాలు ఘోరంగా వచ్చాయి

ABN , First Publish Date - 2023-12-04T22:25:59+05:30 IST

ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ( Jairam Ramesh ) పేర్కొన్నారు. సోమవారం నాడు ఏఐసీసీ కార్యాలయంలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ నేతలు చర్చించారు.

Jairam Ramesh: మూడు రాష్ట్రాలలో ఫలితాలు ఘోరంగా వచ్చాయి

ఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ( Jairam Ramesh ) పేర్కొన్నారు. సోమవారం నాడు ఏఐసీసీ కార్యాలయంలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ నేతలు చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న కీలక అంశాలపై జైరాం రమేష్ మీడియాకు తెలిపారు. ‘‘సోనియా గాంధీ అధ్యక్షతన పార్లమెంట్లో రానున్న బిల్లులపై సమావేశంలో చర్చించాం. ఐపీసీ సీఆర్పీసీ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపాలని పార్లమెంటులో పట్టుబడతాం. అతి త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడు రాష్ట్రాలలో ఫలితాలు మేము ఊహించిన దానికంటే ఘోరంగా వచ్చాయి . ఆయా రాష్ట్రాల ఇన్‌చార్జిలతో త్వరలో దీనిపై సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలపై వచ్చిన ఫలితాలపై సమీక్షిస్తాం ’’ అని జైరామ్ రమేష్ తెలిపారు.

Updated Date - 2023-12-04T22:26:01+05:30 IST