Karnataka Assembly polls: టికెట్ రాలేదని రోదించిన బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-04-18T09:51:12+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల ఖరారు పర్వంలో రోజుకొక సిత్రం బయటపడుతోంది....

Karnataka Assembly polls: టికెట్ రాలేదని రోదించిన బీజేపీ ఎమ్మెల్యే
BJP MLA Ramadas cries

బీజేపీ అధిష్ఠాన వర్గం పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీ ఎమ్మెల్యే రామదాస్ తనకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రోదించారు.

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల ఖరారు పర్వంలో రోజుకొక సిత్రం బయటపడుతోంది. టికెట్ల ఖరారుతో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది.(Karnataka Assembly polls) మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బీజేపీ టికెట్ నిరాకరించిందని(Denied ticket) బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఎస్ఏ రామదాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.బీజేపీ అధిష్ఠాన వర్గం పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీ ఎమ్మెల్యే రామదాస్ తనకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రోదించారు.(BJP MLA Ramadas cries) బీజేపీ పార్టీ నేతలను కలవడానికి రామదాస్ నిరాకరించారు.

ఇది కూడా చదవండి :BREAKING:సుడాన్ ఘర్షణల్లో 200 మంది మృతి,1800మందికి గాయాలు

బీజేపీ తనకు అన్యాయం చేసిందని, తన తదుపరి కార్యాచరణను మంగళవారం నిర్ణయించుకుంటానని రామదాస్ చెప్పారు. స్థానిక బీజేపీ నేతలను కలవడానికి కూడా ఆయన నిరాకరించారు. సోమవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ మాజీ నాయకుడు జగదీష్ శెట్టర్ కాషాయ పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఒక రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇది కూడా చదవండి :Syria: సిరియాలో అమెరికా హెలికాప్టర్ దాడి...సీనియర్ ఇస్లామిక్ స్టేట్ లీడర్ మృతి

ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తన రాజకీయ జీవితం క్లీన్ చిట్, బ్లాక్ స్పాట్ లేదని జగదీష్ చెప్పారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్, జేడీ(ఎస్)పై ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో బహిరంగ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కుల జనాభా గణనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కోసం రాహుల్ చేశారు.

Updated Date - 2023-04-18T10:24:26+05:30 IST