Karnataka Assembly elections: బీజేపీ జాబితా విడుదల వేళ దుమారం

ABN , First Publish Date - 2023-04-10T19:41:39+05:30 IST

నందిని పాల (Nandini Milk) వివాదంపై ఆరోపణలను తిప్పి కొట్టాలని రాష్ట్ర నాయకులకు బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం సూచించింది.

Karnataka Assembly elections: బీజేపీ జాబితా విడుదల వేళ దుమారం
Karnataka Assembly elections

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల వేళ (Karnataka Assembly elections) నందిని పాల (Nandini Milk) వివాదంపై ఆరోపణలను తిప్పి కొట్టాలని రాష్ట్ర నాయకులకు బీజేపీ(BJP) కేంద్ర నాయకత్వం సూచించింది. అమూల్‌ పాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కాంగ్రెస్‌(Congress), జేడీఎస్‌ (JDS) విమర్శలకు దిగాయి. కర్ణాటకలో(Karnataka) నందిని ఉత్పత్తులకు తిరుగులేని డిమాండ్‌ ఉంది. లక్షలాది మంది రైతులు పాల ఉత్పత్తి ద్వారా జీవనం సాగిస్తున్నారు. అమూల్‌ సంస్థ తాము కూడా వ్యాపారం చేస్తామని ప్రకటించడంతో కర్ణాటకలో ఉన్న లక్షలాది మంది రైతులకు నష్టం వాటిల్లుతుందనే రీతిలో ప్రచారం జరిగింది. దీంతో వెంటనే నందిని వివాదానికి తెరదించాలని పార్టీ అగ్రనేతలు సూచించారు. నందిని ఉత్పత్తులకు ఎవరి పాలనలో ప్రాధాన్యత లభించిందో, ప్రజలకు సమగ్రంగా వివరించాలనీ, ఆరోపణలను తిప్పికొట్టాలని బీజేపీ అధిష్టానం సూచించింది. దీంతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Karnataka CM Basavaraj Bommai) స్పందించారు.

కర్ణాటక బీజేపీ మంత్రులు కూడా నందిని ఉత్పత్తులకు ఢోకాలేదనీ, కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. కర్ణాటకలో అమూల్‌ సంస్థ తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయదని, కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఐటీ విభాగం ప్రతినిధి అమిత్‌ మాలవీయ చెప్పారు. గుజరాత్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ అమూల్‌ కర్ణాటకలో ప్రవేశించదన్నారు. కేఎంఎఫ్‌కు చెందిన నందిని ఉత్పత్తులు పెంచేందుకు కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రశ్నించారు. గోవధ నిషేధాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించిందన్నారు. నందిని బ్రాండ్‌ను మరింత ఉన్నత స్థితికి చేర్చేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు.

మాండ్య జిల్లాలో జరిగిన సహకార సంఘాల సమాఖ్య సదస్సులో పాల్గొన్న సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నందిని సంస్థను అమూల్‌లో విలీనం చేయడాన్ని ప్రస్తావించారు. అప్పట్లోనే ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర విమర్శలకు దిగాయి. కర్ణాటక అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తున్న వేళ అమూల్‌ వివాదం తెరపైకి రావడంతో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Ghulam Nabi Azad: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ గుబులు

Sharad Pawar: శరద్ పవార్ వ్యూహాలతో కాంగ్రెస్‌లో కలకలం



Updated Date - 2023-04-10T19:45:54+05:30 IST