Karnataka Polls : ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఎవరికెన్ని వచ్చాయంటే..

ABN , First Publish Date - 2023-05-13T17:41:21+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. కన్నడిగులు కాంగ్రెస్‌‌కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ‘40 శాతం కమిషన్’

Karnataka Polls : ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఎవరికెన్ని వచ్చాయంటే..

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. కన్నడిగులు కాంగ్రెస్‌‌కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ‘40 శాతం కమిషన్’ ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ ప్రభుత్వాన్ని గట్టి దెబ్బ తీశారు. బీజేపీ మంత్రుల్లో చాలా మంది పరాజితుల జాబితాలో చేరిపోయారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారు. ప్రేమ గెలిచిందని రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 65, కాంగ్రెస్ 136, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. తాము కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తామని ప్రియాంక్ చెప్పారు.

కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ కనకపుర నియోజకవర్గంలో సుమారు 1 లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మయ్ షిగ్గాన్ నియోజకవర్గం నుంచి 36 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విజయం సాధించారు.

మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ నేత జగదీశ్ షెట్టార్ హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఆయన ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి మహేశ్ టెంగినకాయ్ 30 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

చన్నపట్న నియోజకవర్గంలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి విజయం సాధించారు. అయితే ఆయన కుమారుడు నిఖిల్ కుమార స్వామి రామనగర నియోజకవర్గంలో పరాజయాన్ని చవి చూశారు.

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర దాదాపు 10 వేల ఓట్ల ఆధిక్యంతో శికారిపుర నియోజకవర్గంలో విజయం సాధించారు.

బీజేపీ మంత్రులు బీసీ పాటిల్, గోవింద కరజోల, డాక్టర్ కే సుధాకర్, ఎంటీబీ నాగరాజు, బీ శ్రీరాములు, నారాయణ గౌడ, మురుగేశ్ నిరానీ ఓటమిపాలయ్యారు.

ఇవి కూడా చదవండి :

JDS KumaraSwamy: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే

Updated Date - 2023-05-13T17:41:21+05:30 IST