Mamata Banerjee: చంద్రబాబు అరెస్ట్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ రియాక్షన్.. ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-09-11T18:54:04+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు...

Mamata Banerjee: చంద్రబాబు అరెస్ట్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ రియాక్షన్.. ఏమన్నారంటే?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యంగా స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని, కక్ష సాధింపు చర్యలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు అరెస్ట్ ఏమాత్రం సబబు కాదు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, దానిపై మాట్లాడాలి. అనంతరం సరైన విచారణ జరిపించాలి. కానీ కక్షపూరితంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.


ఇదే సమయంలో తన విదేశీ పర్యటనపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల తర్వాత తాను విదేశాలకు వెళ్తున్నానని.. నిజానికి తనకు ఇప్పటివరకూ విదేశాల నుంచి ఎన్నో ఆహ్వానాలు వచ్చినా తనకు ఇక్కడ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఢిల్లీ పోలీసులు తమకు శత్రువులు కాదని.. కానీ, రాజకీయంగా ఆందోళనలకు పిలుపునిచ్చినందుకు అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదని వివరణ ఇచ్చారు. అయినా రాజ్‌ఘాట్‌కు వెళ్లి నివాళి అర్పిస్తామన్నారు. ఇక తన అల్లుడు, తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీకి ఈడీ నోటీసులు పంపించడాన్ని ఆమె ఖండించారు.

ఇదిలావుండగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో లాయర్లు రంగంలోకి దిగి.. హౌస్ కస్టడీ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టులో వాదనలు ఇంకా పూర్తి కాలేదు. అయితే.. హౌస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-09-11T18:54:04+05:30 IST