Minister Udayanidhi: కొడనాడు వ్యవహారం.. మంత్రి ఉదయనిధికి స్టే కొనసాగింపు

ABN , First Publish Date - 2023-10-07T12:18:46+05:30 IST

కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై

Minister Udayanidhi: కొడనాడు వ్యవహారం.. మంత్రి ఉదయనిధికి స్టే కొనసాగింపు

పెరంబూర్‌(చెన్నై): కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి మద్రాసు హైకోర్టు విధించిన నిషేధం పొడిగించింది. కొడనాడు వ్యవహారంలో తన పేరుకు కళంకం తెచ్చేలా మంత్రి ఉదయనిధి మాట్లాడుతున్నారని, ఈ వ్యవహారంపై తనపై వ్యాఖ్యలు చేసేందుకు మంత్రిపై స్టే విధించాలని, రూ.1.10 కోట్ల పరిహారం అందించాలని మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(AIADMK general secretary Edappadi Palaniswami) పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం, కొడనాడు వ్యవహారంలో పళనిస్వామిని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై మంత్రి ఉదయనిధికి స్టే విధిస్తూ, ఈ కేసులో రెండు వారాల్లో బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని మంత్రికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, బదులు పిటిషన్‌ దాఖలుకు అవకాశం కావాలని మంత్రి తరఫు న్యాయవాది కోరారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణ నవంబరు 2వ తేదీకి వాయిదా వేయడంతో పాటు మంత్రి ఉదయనిధికి విధించిన స్టే కూడా నవంబరు 2వ తేది వరకు పొడిగించింది.

Updated Date - 2023-10-07T12:18:46+05:30 IST