Railways discount scheme : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలు ఛార్జీల్లో డిస్కౌంట్..

ABN , First Publish Date - 2023-07-08T15:44:10+05:30 IST

రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది.

Railways discount scheme : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలు ఛార్జీల్లో డిస్కౌంట్..

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది. రైళ్లలో వసతులు సాధ్యమైనంత ఎక్కువగా వినియోగమయ్యే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇటువంటి ఏసీ రైళ్ల ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని, అయితే ఇప్పటికే టిక్కెట్లను బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తించదని, ఎటువంటి తిరిగి చెల్లింపులు ఉండబోవని వివరించింది.

డిస్కౌంట్ పథకం వివరాలు :

- ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాసెస్‌కు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అనుభూతి, విస్టాడోమ్ బోగీలు ఉన్న రైళ్లు సహా ఏసీ సిట్టింగ్ అకామడేషన్ ఉన్న అన్ని రైళ్లకూ వర్తిస్తుంది.

- టిక్కెట్ మూల ఛార్జీలో గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్ ప్రయాణికునికి లభిస్తుంది. అయితే రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ ఛార్జీలు, జీఎస్‌టీ వేర్వేరుగా విధిస్తారు.

- వందే భారత్ రైళ్లలో గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో బేస్ ఫేర్ (మూల ఛార్జీ)పై గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

- ఈ డిస్కౌంట్ పథకం గరిష్ఠంగా ఆరు నెలలపాటు అమలవుతుంది. డిమాండ్‌నుబట్టి నెలవారీ లేదా సీజనల్ లేదా వారాంతపు రోజులు ఈ పథకం అమలవుతుంది.

- ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ ఆధారంగా ఈ పథకాన్ని సమీక్షించి, పొడిగించడమా? ఉపసంహరించడమా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.

- సెలవులు, పండుగల సమయంలో నడిపే ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తించదు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : పొలంలో దిగి, నాట్లు వేసి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ

West Bengal panchayat election : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. నలుగురు టీఎంసీ కార్యకర్తల హత్య..

Updated Date - 2023-07-08T15:44:10+05:30 IST