Modi, Stalin: మళ్లీ ఒకే వేదికపై నరేంద్ర మోదీ, స్టాలిన్‌

ABN , First Publish Date - 2023-04-06T11:17:00+05:30 IST

చెన్నై - కోయంబత్తూరు నగరాల నడుమ వందేభారత్‌ రైలు(Vande Bharat train) సర్వీసును ప్రారంభించే నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ

Modi, Stalin: మళ్లీ ఒకే వేదికపై నరేంద్ర మోదీ, స్టాలిన్‌

- 8న నగరానికి ప్రధాని రాక

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై - కోయంబత్తూరు నగరాల నడుమ వందేభారత్‌ రైలు(Vande Bharat train) సర్వీసును ప్రారంభించే నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) ఈ నెల 8న నగరానికి విచ్చేస్తున్నారు. ఈ రైలు ప్రారంభోత్సవంలో ఒకే వేదికపై మోదీ, సీఎం స్టాలిన్‌(CM Stalin) ఆశీనులు కానున్నారు. అధికారిక సమాచారం మేరకు... ప్రధాని మోదీ ఈ నెల 8న మధ్యాహ్నం 1.35 గంటలకు హైదరాబాద్‌9Hyderabad) నుంచి వైమానిక దళం ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.45 గంటలకు చెన్నైలోని పాత విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మీనంబాక్కం విమానాశ్రయం వద్ద కొత్త టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.20కి కారులో బయలుదేరి పాత విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌(Helicopter)లో బయలుదేరి మెరీనా బీచ్‌ నేపియర్‌ వంతెన సమీపంలోని అడయార్‌ ఐఎన్‌ఎస్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో సాయంత్రం నాలుగు గంటలకు సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుని వందేభారత్‌ రైలును ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.25 గంటలకు కారులో బయలుదేరి మైలాపూరు శ్రీరామకృష్ణమఠం చేరుకుంటారు. అక్కడి జరిగే ఆ మఠం 125వ వార్షికోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ఆ వేడుకలు పూర్తయ్యాక కారులో బయలుదేరి ఐఎన్‌ఎస్ హెలిపాడ్‌కు వెళ్ళి అక్కడి నుండి హెలికాప్టర్‌లో పల్లావరం అల్‌స్టామ్‌ ఇంగ్లీష్‌ ఎలక్ర్టికల్స్‌ ఫ్యాక్టరీ మైదానం చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 7.30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) కూడా పాల్గొంటారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని రాత్రి 7.40 గంటలకు పాత విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి వైమానిక దళం ప్రత్యేక విమానంలో బయలుదేరి మైసూరుకు వెళతారు. మరుసటి రోజు ఉదయం మైసూరు నుండి హెలికాప్టర్‌లో బయలుదేరే ప్రధాని మోదీ నీలగిరి(Nilgiris) జిల్లా తెప్పకులం ఏనుగుల సంరక్షణ శిబిరాన్ని చేరుకుంటారు. అక్కడి కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత ఆయన హెలికాప్టర్‌లో మైసూరుకు బయలుదేరి వెళతారు. ప్రధాని రాకను పురస్కరించుకుని చెన్నై, నీలగిరి జిల్లా తెప్పకులం పరిసర ప్రాంతాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక దళం సభ్యులతోపాటు రాష్ట్ర పోలీసులు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

Updated Date - 2023-04-06T11:17:00+05:30 IST