Modi tour effect: సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో నిఘా ముమ్మరం

ABN , First Publish Date - 2023-04-05T12:09:15+05:30 IST

చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య ‘వందే భారత్‌’ రైలు('Vande Bharat' train) సేవలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ

Modi tour effect: సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో నిఘా ముమ్మరం

పెరంబూర్‌(చెన్నై): చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య ‘వందే భారత్‌’ రైలు('Vande Bharat' train) సేవలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేది నగరానికి రానున్న నేపథ్యంలో, చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా నిఘాను ముమ్మరం చేశాయి. చెన్నై విమానాశ్రంలో కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి ఈనెల 8న ప్రధాని నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా చెన్నై-కోయంబత్తూర్‌ మధ్య వందే భారత్‌ రైలు సేవలు, తాంబరం-సెంగోట్టై(Tambaram-Sengottai) మధ్య వారంలో మూడు రోజులు నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలను ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే, రూ.294 కోట్లతో తిరుత్తురైపూండి-అగస్తియంపల్లి మధ్య 37 కి.మీ దూరం పూర్తయిన బ్రాడ్‌వేను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీ రాకను పురస్కరించుకొని చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో భద్రత, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించా రు. శనివారం సాయంత్రం 4 నుంచి 4.30 గంటల్లోపు చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ చేరుకొని, వందే భారత్‌ రైలు(Vande Bharat Train) ప్రారంభించానున్నారు. సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లోని 10, 11 ఫ్లాట్‌ఫారం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు, సమీపంలో భవనాలపై పోలీసుల మోహరింపు, ప్రారంభోత్సవం జరిగే 11వ ఫ్లాట్‌ఫారం వద్ద వేదిక తదితరాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రధాని పర్యటన ఇంకా ఖరారు కాకపోయినా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు

Updated Date - 2023-04-05T12:09:15+05:30 IST