Moscow court: వికీపీడియాకు జరిమానా విధించిన మాస్కో కోర్టు
ABN , First Publish Date - 2023-04-14T22:54:18+05:30 IST
వికీపీడియాకు మాస్కో కోర్టు (Moscow court) గురువారం మరోసారి జరిమానా విధించింది.
మాస్కో: వికీపీడియాకు మాస్కో కోర్టు (Moscow court) గురువారం మరోసారి జరిమానా విధించింది. ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా చేస్తున్న యుద్ధానికి సంబంధించి కొన్ని కథనాలు ప్రచురించగా.. రష్యా (Russia) వ్యతిరేక కథనాలను తొలగించాలంటూ వికీపీడియాకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రష్యాకు వ్యతిరేకంగా ప్రచురించిన వార్తను తొలగించనందుకు వికీపీడియాకు (2 మిలియన్ రుబుల్స్) రూ. 20 లక్షలు జరిమానా విధించింది.
రష్యా జపోరిజియాను ఆక్రమించుకుందని వికీపీడియాలో ఓ కథనం వచ్చింది. ఈ కథనంపై రష్యా ప్రభుత్వం స్పందిస్తూ ఆ వార్త అవాస్తమైనదని మండిపడింది. ఆ కథనాన్ని తొలగించాలని కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ వ్యవహారంపై కోర్టు విచారణ చేపట్టగా.. ఇరువర్గాలు తమ వాదనలను కోర్టుకు తెలిపారు. విచారణ అనంతరం మాస్కో కోర్టు వికీపీడియాకు జరిమానా విధించింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యవహారంలో ఇటీవల సైకియా అనే రష్యా రాక్‌బ్యాండ్ పాటను తొలగించనందుకు వికీపీడియాకు 8 లక్షల రుబుల్స్ జరిమానా వేసింది.