Share News

PM Modi: నేడు డైమండ్ బోర్స్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ABN , Publish Date - Dec 17 , 2023 | 08:00 AM

నూతనంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటన కూడా చేసింది.

PM Modi: నేడు డైమండ్ బోర్స్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అహ్మదాబాద్: నూతనంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటన కూడా చేసింది. డైమండ్ బోర్స్‌ని ప్రధానిమంత్రి నేడు ప్రారంభించనున్నారని పేర్కొంది. దీంతో అంతర్జాతీయ వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంగా డైమండ్ బోర్స్ నిలుస్తుందని పేర్కొంది. ఇది వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ‘కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్’ దిగుమతి, ఎగుమతి కోసం, జ్యువెలరీ వ్యాపారం కోసం ఒక అభరణాల మాల్ అని, అంతర్జాతీయ బ్యాంకింగ్, వాల్ట్‌ల కోసం సౌకర్యవంతమైనది తెలిపింది. డైమండ్ బోర్స్ ప్రారంభోత్సవం గురించి మోదీ కూడా శనివారం తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ‘‘ఆదివారం సూరత్‌లో డైమండ్ బోర్స్ ప్రారంభిస్తాం. ఇది వజ్రాల పరిశ్రమకు ఊపునిస్తుంది. కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, జ్యువెలరీ మాల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, సేఫ్ వాల్ట్‌ల సౌకర్యం ఇందులో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.


అంతేకాకుంUntitled-1 copy.jpgడా డైమండ్ బోర్స్‌ కార్యాలయానికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 4,500 డైమండ్ ట్రేడింగ్ కార్యాలయాలు ఉన్నాయి. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో భాగమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఈ ఏడాది ఆగస్టులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 35.54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగాస్ట్రక్చర్‌లో తొమ్మిది గ్రౌండ్ టవర్‌లతో పాటు 15 అంతస్తులు ఉన్నాయి. 300 చదరపు అడుగుల నుంచి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుంచి ప్లాటినం ర్యాంకింగ్ ఉంది. కాగా బిలియనీర్ వజ్రాల వ్యాపారి, కిరణ్ జెమ్స్ డైరెక్టర్ వల్లభ్‌భాయ్ లఖానీ తన రూ.17,000 కోట్ల వ్యాపారాన్ని డైమండ్ బోర్స్‌కు మార్చారు. తన ఉద్యోగులను ఉంచడానికి మినీ-టౌన్‌షిప్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Updated Date - Dec 17 , 2023 | 08:09 AM