NDA Meeting: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. ఆ 48 స్థానాలకోసమేనా?

ABN , First Publish Date - 2023-07-09T12:41:39+05:30 IST

పార్లమెంట్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోందా..? మహారాష్ట్రలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు సానుకూల పార్టీలు నేతలతో బీజేపీ చర్చలు జరుపుతోందా? కలిసి వచ్చే వారితో లాబీయింగ్ చేస్తోందా? తాజా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఎన్డీయే కూటమి సమావేశానికి కలిసివచ్చే పార్టీలు, నేతలను ఎన్డీయే కూటమి సమావేశాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

NDA Meeting: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి.. ఆ 48 స్థానాలకోసమేనా?

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోందా..? మహారాష్ట్రలో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు సానుకూల పార్టీలు నేతలతో బీజేపీ చర్చలు జరుపుతోందా? కలిసి వచ్చే వారితో లాబీయింగ్ చేస్తోందా? తాజా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఎన్డీయే కూటమి సమావేశానికి కలిసివచ్చే పార్టీలు, నేతలను ఎన్డీయే కూటమి సమావేశాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.


మహారాష్ట్రలో ఇప్పటికే బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ ఎన్సీపీ గ్రూప్, షీండే టీమ్ జూలై 18న జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్డీయే కూటమిలోకి చేరాలని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్‌‌తో బీజేపీ జరిపిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో మొత్తం లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఎన్డీయే కూటమి బలోపేతానికి వ్యూహ రచన చేస్తోంది. బీజేపీతో కలిసి వచ్చే నేతలు, పార్టీలను ఎన్డీయేలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఇందులో భాగంగానే సానుకూలంగా స్పందించే పార్టీలు, నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. అన్ని వర్గాలను కలుపుకుని పోతేనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గలేమని గ్రహించిన బీజేపీ.. ఆయా వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగానే ఓబీసీ నేత జనతా దళ్(ఎస్) నాయకుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌, భారతీయ సమాజ్ పార్టీ నుంచి సుహేల్ దేవ్, మత్స్యకార వర్గం నుంచి వికాష్ షీల్ ఇన్సాన్ పార్టీ నేత ముఖేష్ సాహ్నీని ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించాలని బీజేపీ నిర్ణయించింది.


మహారాష్ట్రలోని అన్ని స్థానాలపై గురి!

ఎన్డీయే సమావేశానికి హాజరవుతున్న అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి నుంచి ప్రఫుల్ పటేల్‌కు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం ఉంది. పార్టీ నుంచి విడిపోయేముందు ప్రఫుల్ పటేల్‌ను శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సలే ఎన్సీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. మరోవైపు అధికార శివసేన పార్టీ కూడా ఎన్డీయే సమావేశంలో పాల్గొననుంది. ఈ పరిణామాలన్నింటిని చూస్తే 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలిచేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలోపేతానికి గట్టి పునాదిపై వేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - 2023-07-09T12:42:00+05:30 IST