New Parliament : సాధికారతను సంరక్షించే చోటు.. నూతన పార్లమెంటు భవనంపై మోదీ వ్యాఖ్య..
ABN , First Publish Date - 2023-05-28T11:51:46+05:30 IST
భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగిన
న్యూఢిల్లీ : భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగిన ప్రత్యేక హోమాలు, పూజల నడుమ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, తమిళనాడు ఆధీనమ్‌ల మఠాధిపతులు పాల్గొన్నారు. ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నమైన రాజదండం (సెంగోల్)ను మోదీ ఈ నూతన భవనంలోని లోక్‌సభ సభాపతి ఆసనం సమీపంలో ప్రతిష్ఠించారు.
నూతన పార్లమెంటు భవనం సాధికారత, రగిలే స్వప్నాలకు కేంద్రంగా నిలవాలని, జ్వలించే స్వప్నాలు సాకారమయ్యేలా చేసే చోటుగా విలసిల్లాలని మోదీ ఆకాంక్షించారు.
త్రికోణాకారం ఎందుకు?
స్థలాన్ని అత్యధికంగా సద్వినియోగం చేసుకోవడం కోసమే నూతన పార్లమెంటు భవనాన్ని త్రికోణాకారంలో నిర్మించారు. ఈ నూతన భవన సముదాయంలో విశాలమైన లెజిస్లేటివ్ చాంబర్స్ ఉన్నాయి. కొత్త లోక్‌సభలో సీట్లు పాత లోక్‌సభలో కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయి. కొత్త లోక్‌సభలో ఉభయ సభల సమావేశాలు జరిగినపుడు 1,272 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. నూతన భవన సముదాయంలో మధ్యలో ‘కాన్‌స్టిట్యూషనల్ హాల్’ ఉంది. ఈ భవనంలో నాలుగు అంతస్థులు ఉన్నాయి. దీని బిల్టప్ ఏరియా 64,500 చదరపు మీటర్లు. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వీటికి జ్ఞాన ద్వారం, శక్తి ద్వారం, కర్మ ద్వారం అని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకుల ప్రవేశానికి వేర్వేరు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మెటీరియల్స్‌తో ఈ భవనాన్ని నిర్మించారు.
మోదీకి ఆధీనమ్‌ల ఆశీర్వాదాలు
సెంగోల్‌ను లోక్‌సభ సభాపతి ఆసనం సమీపంలో ప్రతిష్ఠించడానికి ముందు, ఆ రాజదండాన్ని చేతిలో ధరించి, ఆధీనమ్‌ల ఆశీర్వాదాలను మోదీ స్వీకరించారు. ఆధీనమ్‌లకు శిరసు వంచి నమస్కరిస్తూ, వారి ఆశీర్వాదాలను స్వీకరించారు. వారు ఆయనపై అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. ఆ రాజదండానికి మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు.
ఇవి కూడా చదవండి :
Parliament Building Inauguration Live Updates : నవ శకం.. నవ భారతం.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం..
New Parliament : బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేసిన మోదీ