Bajrang Dal row : మూర్ఖత్వానికి ఉదాహరణ.. కాంగ్రెస్‌పై నిర్మల సీతారామన్ ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-05-10T10:57:55+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్బు ధవారం కాంగ్రెస్‌ (Congress)పై తీవ్రంగా మండిపడ్డారు.

Bajrang Dal row : మూర్ఖత్వానికి ఉదాహరణ.. కాంగ్రెస్‌పై నిర్మల సీతారామన్ ఆగ్రహం..
Nirmala Sitharaman

బెంగళూరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Union finance minister Nirmala Sitharaman) బుధవారం కాంగ్రెస్‌ (Congress)పై తీవ్రంగా మండిపడ్డారు. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం బజరంగ్ దళ్ (Bajrang Dal)పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో చెప్పడం మూర్ఖత్వానికి ఉదాహరణ అని చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, బజరంగ్ బలిని మనం ఎల్లప్పుడూ గౌరవిస్తామని, హనుమాన్ చాలీసాను పఠిస్తామని చెప్పారు. అయితే కాంగ్రెస్‌కు ఇదొక ఎన్నికల అంశం అయిందన్నారు. హనుమంతుడి జన్మస్థలం కర్ణాటక అని గుర్తు చేశారు.

నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం బెంగళూరు, జయ నగర్‌లోని భారత్ ఎడ్యుకేషన్ సొసైటీ పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. దీంతో వివాదం తలెత్తింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జై బజరంగ్ బలి అంటూ ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ, బజరంగ్ బలిని, బజరంగ్ దళ్‌ను బీజేపీ ఒకే గాటన కడుతోందని విమర్శించింది.

కాంగ్రెస్ కర్ణాటక శాఖ అధ్యక్షుడు డీకే శివకుమార్ మంగళవారం గ్యాస్ ధరలు విపరీతంగా ఉన్నాయని ప్రజలకు గుర్తు చేయడం కోసం ఓ గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంజనేయ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Karnataka polls live updates: కర్ణాటక పోలింగ్ జరుగుతుండగా ప్రధాని మోడీ కీలక ట్వీట్... బార్లు తీరుతున్న ఓటర్లు.. ఇప్పటివరకు పోలింగ్ శాతం ఎంతంటే..

Karnataka Election : ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. : ప్రముఖులు

Updated Date - 2023-05-10T10:57:55+05:30 IST